దిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం(ISRAEL EMBASSY) సమీపంలో జరిగిన పేలుడు ఘటన పై పోలీసు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు.
జామియా నగర్ నుంచి ఆటో లో వచ్చిన ఓ వ్యక్తే కుట్రకు బాధ్యుడిగా అనుమానిస్తున్నారు. దీంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగుతోంది. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దౌత్యాధికారిని బెదిరించేందుకే ఈ కుట్ర చేశారని గుర్తించిన పోలీసులు, పేలుడు కోసం వాడిన రసాయనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.
ఈ నెల 26న సాయంత్రం వేళ దిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు సంభవించింది. దీనిపై తుగ్లక్ రోడ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.