Fuel Tanker Explosion
లైబీరియాలో
దారుణం జరిగింది. బోల్తా కొట్టిన పెట్రోల్ ట్యాంకర్ పేలిన ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోగా
మరో 83 మంది తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో లైబీరియా కూడా ఒకటి.
టొటొటలో
పెట్రోల్ లోడుతో వెళుతున్న ట్యాంకర్ పల్టీ కొట్టింది, దీంతో ట్యాంకర్ నుంచి
చిమ్ముతున్న పెట్రోల్ ను పట్టుకునేందుకు
స్థానికులు ఎగబడ్డారు. ఆ సమయంలో పేలుడు జరగడంతో
40 మంది అక్కడికక్కడే మరణించారు.
తీవ్రంగా
గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని
ఆ దేశ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి తెలిపారు. అయితే
ట్యాంకర్ బోల్తా పడటానికి గల కారణం ఇంకా తెలియరాలేదన్నారు.
ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన
లైబీరియా అధ్యక్షుడు జార్జ్ వీహ్, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన
వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.