శ్రీలంక
క్రికెటర్ దనుష్క గుణతిలకపై నమోదైన అత్యాచార కేసును ఆస్ట్రేలియా కోర్టు కొట్టివేసింది.
దీంతో గుణతిలక నిర్దోషిగా కేసు నుంచి బయటపడ్డారు.
గతఏడాది
టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ఆస్ట్రేలియా మహిళపై లైంగికదాడికి యత్నించినట్లు దనుష్క
గుణతిలకపై ఆరోపణలు వచ్చాయి. సిడ్నీ పోలీసులు అతడిని అరెస్టు చేయగా బెయిల్ పై
విడుదలయ్యారు. ప్రస్తుతం ఈ కేసుపై ఆస్ట్రేలియా కోర్టు తీర్పు వెల్లడించింది.
గుణతిలకకు,
ఆన్లైన్ లో 29 ఏళ్ళ మహిళ పరిచయమైంది, వీరిద్దరూ నవంబర్ 2న సిడ్నీలోని రోజ్ బే ప్రాంతంలో ఓ హోటల్ లో కలుసుకున్నారు.
అప్పుడు గుణతిలక తనపై లైంగికదాడికి యత్నించాడని సదరు మహిళ ఆరోపించింది. దీంతో
పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
విచారణ సందర్భంగా సదరు మహిళ రెండు రకాలు వాదనలు చెప్పింది. దీంతో న్యాయమూర్తి
తీర్పును గుణతిలకకు అనుకూలంగా ఇచ్చారు.
కోర్టు తనను నిర్దోషిగా తేల్చడంపై గుణతిలక హర్షం
వ్యక్తం చేశారు. తనపై వచ్చిన అన్ని ఆరోపణలకు కోర్టే సమాధానం చెప్పిందన్నారు.
శ్రీలంక తరఫున క్రికెట్ ఆడేందుకు ఎదురు చూస్తున్నా, తప్పకుండా జాతీయజట్టులోకి
వస్తా అని ఆశాభావం వ్యక్తం చేశారు.
శ్రీలంక తరఫున వందకుపైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన
గుణతిలకను ఈ సంఘటన తర్వాత సస్పెండ్ చేస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం
తీసుకుంది.