చంద్రయాన్-3 వ్యోమనౌక చంద్రుడి దక్షిణ ధ్రువం మీద దింపిన
ల్యాండర్, రోవర్ తమ పని ప్రారంభించాయి. విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ జాగ్రత్తగా, సురక్షితంగా చంద్రుడి ఉపరితలం మీద
దిగింది. ఆ క్రమాన్ని విక్రమ్ వీడియో తీసింది. ఆ వీడియోను ఇస్రో ఇప్పటికే ప్రపంచానికి
చూపించింది.
ఇప్పుడు, ప్రజ్ఞాన్
రోవర్ చంద్రుడి ఉపరితలం మీద తిరుగుతున్న దృశ్యాలను సైతం విక్రమ్ ల్యాండర్
పంపించింది. శివశక్తి పాయింట్‌గా పేరు పెట్టిన ప్రదేశం చేరువలో ప్రజ్ఞాన్ రోవర్
తిరుగుతూఉన్నదృశ్యాలను
చిత్రీకరించింది. ఆ వీడియోను ఇస్రో ఇవాళ షేర్ చేసింది. ‘‘దక్షిణ ధ్రువం దగ్గర
చందమామ రహస్యాల అన్వేషణలో భాగంగా ప్రజ్ఞాన్, శివశక్తి పాయింట్ దగ్గర తిరుగుతోంది’’
అంటూ ట్వీట్ చేసింది.
చంద్రయాన్-3
చేసే పరిశోధనల గురించి, ఆ పరిశోధనల వల్ల వెల్లడయ్యే సాంకేతిక రహస్యాల గురించి
యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది