Friday, May 10, 2024

Logo
Loading...
upload upload upload

supreme court news

కోర్టులపై రాజకీయ నేతలు ఒత్తిడి తెస్తున్నారు : సీజేకు న్యాయవాదుల లేఖ

కోర్టు తీర్పులను ప్రభావితం చేసేలా కొందరు రాజకీయ నాయకులు ఒత్తిడి వ్యూహాలు అమలు చేస్తున్నారంటూ 600 మంది న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఇది పెద్ద చర్చకు దారితీసింది. న్యాయవ్యవస్థకు మచ్చ తెచ్చేలా రాజకీయ నాయకులు కోర్టుల ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని, వారు ఆ లేఖలో వివరించారు.




స్వార్థ ప్రయోజనాల కోసం, వారి వ్యక్తిగత లబ్దికోసం రాజకీయ నాయకులు న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకు వస్తున్నారంటూ న్యాయవాదులు, సుప్రీంకోర్టు సీజేకు రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీని వల్ల కోర్టులపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే ప్రమాదముందన్నారు. మీడియాతో మాట్లాడేప్పుడు న్యాయమూర్తులను కించపరిచే విధంగా మాట్లాడటం ఆందోళన కలిగిస్తోందన్నారు.



రాజకీయ నాయకులు అవినీతి ఆరోపణలు చేసుకోవడం, తరవాత కోర్టులో సమర్థించుకోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.అనుకూల తీర్పులు రాకుండా బహిరంగ విమర్శలకు దిగుతున్నారని కూడా ప్రముఖ న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా లేఖలో సీజేను కోరారు.

K Venkateswara Rao | 13:23 PM, Thu Mar 28, 2024

ఉచిత హామీల పిల్ స్వీకరించిన సుప్రీంకోర్టు

సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమైన వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై దాఖలైన ప్రజా ప్రయోజ వ్యాఖ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. త్వరలో ఈ కేసును లిస్ట్ చేస్తామని ప్రకటించింది. రాబోయే కొద్ది రోజుల్లో ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఉచిత హామీలిచ్చే పార్టీల గుర్తులు రద్దు చేయాలని, అలాంటి పార్టీల రిజిస్ట్రేషన్ తీసేసేందుకు ఎన్నికల సంఘం తన అధికారాలను ఉపయోగించాలంటూ పిటిషనర్ పిల్‌లో కోరారు.



ఉచిత హామీలపై దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం పరిశీలించింది. ఎన్నికల కంటే ముందే విచారించాలన్న పిటిషనర్ అభ్యర్థనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ముఖ్యమైన అంశంగా పరిగణించి, రేపు బోర్డు ముందు ఉంచనున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది.

K Venkateswara Rao | 14:11 PM, Wed Mar 20, 2024

ఎన్నికల బాండ్ల వివరాలు వెంటనే వెల్లడించండి : సుప్రీంకోర్టు

రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చిన విరాళాల వివరాలు సమర్పించడానికి సమయం కావాలంటూ ఎస్‌బీఐ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మార్చి 12లోగా వివరాలు అందించాలని అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది.వచ్చే శుక్రవారం సాయంత్రం నాటికి వివరాలు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచడానికి ఈసీ వివరాలు కోరుతోందని సుప్రీంకోర్టు వెల్లడించింది. అదనపు సమయం కావాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభ్యర్థనను తోసిపుచ్చింది. మార్చి 12 సాయంత్రానికి వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. జూన్ 30 వరకు గడువు కావాలంటూ ఎస్‌బీఐ చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది.



రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించే వెసులుబాటు ఎన్నికల బాండ్ల ద్వారా కల్పించారు. ఈ పథకాన్ని సుప్రీంకోర్టు గత నెల 15న రద్దు చేసింది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు కేంద్ర ఎన్నికల సంఘానికి అందించాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. దాతల వివరాలు, తీసుకున్న వారి వివరాలు వేరు వేరుగా ఉన్నాయని, వాటిని మ్యాచ్ చేసి వివరాలు పొందుపరిచేందుకు సమయం కావాలంటూ ఎస్‌బీఐ కోరింది. ఇందుకు కోర్టు నిరాకరించింది.



అదనపు సమయం కోరడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధర్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశం. గత నెల ఆదేశాలిచ్చాం. సమయం కావాలని మరలా వచ్చారంటూ...ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఎన్ని బాండ్లు జారీ చేశారో చెప్పాలని కోర్టు కోరింది. మార్చి 12 సాయంత్రంలోగా వివరాలు ఈసీకి అందించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది.

K Venkateswara Rao | 13:02 PM, Mon Mar 11, 2024

చండీగఢ్ మేయర్ ఎన్నిక రీకౌంటింగ్‌కు సుప్రీం ఆదేశం

చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదంలో పడింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. దానిపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం, రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రీ కౌంటింగ్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్, జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల త్రిసభ్య ధర్మాసనం 8 బ్యాలెట్లను పరిశీలించింది. అవి చెల్లుబాటు కానివి కావడంతో తిరిగి మరలా ఓట్లు లెక్కించాలని ఆదేశించింది.



చండీగఢ్ మేయర్ ఎన్నికల కౌంటింగ్‌లో రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. కొన్ని బ్యాలెట్ పేపర్లపై రాతలు ఉండటాన్ని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. బ్యాలెట్లపై కొట్టివేత గుర్తులపై కూడా రిటర్నింగ్ అధికారిని ప్రశ్నించారు. బ్యాలెట్లపై రాతలు ఉండటంతో వాటిపై ఇంటు మార్కు గుర్తులు పెట్టినట్లు అనిల్ మసీహ్ ధర్మాసనం ముందు తెలిపారు. వాటిని త్రిసభ్య ధర్మాసనం పరిశీలించి, తీర్పు వెలువరించింది.




K Venkateswara Rao | 17:11 PM, Tue Feb 20, 2024

అరెస్టును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన మాజీ సీఎం హేమంత్ సోరెన్

మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును (supreme court) ఆశ్రయించారు. తన అరెస్టు అక్రమమంటూ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. అరెస్టుకు ముందు ఆయన ఓ వీడియో రికార్డు చేశారు. ఆలస్యంగా ఆ వీడియో గురువారంనాడు వెలుగులోకి వచ్చింది.

ఈడీ అరెస్టు చేసేలా ఉంది. నేనేమీ బాధపడటం లేదు. నేను శిబూసోరెన్ కుమారుడిని. రోజంతా ప్రశ్నించి సంబంధం లేని కేసులుపెట్టి, అక్రమంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారంటూ అరెస్టుకు ముందు రికార్డు చేసిన వీడియో వైరల్ అయింది. దేశ రాజధాని ఢిల్లీలోని తన నివాసంలో తనిఖీలు చేసి తన పరువు తీయాలని చూశారు. ఆదివాసీలు, అమాయకులు, దళితులపై అరాచకాలకు పాల్పడే వారిపై పోరాటం చేయాల్సిన అవసరముందని ఆ వీడియోలో సోరెన్ అభిప్రాయపడ్డారు.

K Venkateswara Rao | 12:39 PM, Thu Feb 01, 2024
upload
upload