Friday, May 10, 2024

Logo
Loading...
google-add

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

T Ramesh | 10:23 AM, Thu Apr 25, 2024

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కుమార్ విశ్వజిత్‌ను, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో విజయవాడ సీపీగా ఉన్న కాంతి రాణాటాటాను, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులను ఈసీ బదిలీ చేసింది. వారిద్దరికీ ఎన్నికల ప్రక్రియతో సంబంధం లేని విధులు కేటాయించాలని ఆదేశించింది. దీంతో  వీరిద్దరి స్థానంలో నూతన నియామకాలు చేపట్టారు.

కుమార్‌ విశ్వజిత్‌ 1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి.  ప్రస్తుతం ఆయన రైల్వే విభాగం అదనపు డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ నిఘా విభాగాధిపతిగా పనిచేశారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డీజీగా, ఏసీబీ డీజీగా పనిచేశారు.

2001 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన పీహెచ్‌డీ రామకృష్ణ ప్రస్తుతం డీఐజీ స్థాయి అధికారి గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  చిత్తూరు, గుంటూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం ఏసీబీలో డైరెక్టర్‌గా ఉన్నారు.

google-add
google-add
google-add

ప్రభుత్వ పథకాలు

google-add
google-add
google-add

చరిత్రలో ఈరోజు

విధాత తలపు బాపు

P Phaneendra | 15:38 PM, Fri Dec 15, 2023
google-add
google-add