Friday, May 10, 2024

Logo
Loading...
google-add

తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సాలకు ఏర్పాట్లు

T Ramesh | 09:33 AM, Tue Apr 09, 2024

తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి  ఆలయంలో ఏప్రిల్ 21 నుంచి 23 వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.   ప్రతీ ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమి రోజున ఉత్సవాలు ముగిసేటట్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఏప్రిల్ 21 ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు  మాడవీధులలో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు ఉంటుంది. వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం స్వామివారు  ఆలయానికి చేరుకుంటారు.

రెండోరోజు ఏప్రిల్ 22న శ్రీ భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఉదయం బంగారు రథాన్ని అధిరోహించి ఊరేగుతారు. వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని జరుపుతారు. చివరిరోజు అంటే  ఏప్రిల్ 23న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామితో పాటు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఉత్సవాల  సందర్భంగా ప్రతీ రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ప్రతీ రోజు సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు.

వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది.   వసంతోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 23న అష్టదళ పాదపద్మారాధన, ఏప్రిల్ 21 నుంచి 23 వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.

google-add
google-add
google-add

ప్రభుత్వ పథకాలు

google-add
google-add
google-add

చరిత్రలో ఈరోజు

విధాత తలపు బాపు

P Phaneendra | 15:38 PM, Fri Dec 15, 2023
google-add
google-add