Friday, May 10, 2024

Logo
Loading...
google-add

మార్చి 20 నుంచి తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు

T Ramesh | 10:45 AM, Sun Mar 10, 2024

కలియుగదైవం శ్రీవేంకటేశుడు కొలువైన  తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  మార్చి 20 నుంచి 24 వరకు ఈ క్రతువు నిర్విహించనున్నారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో లక్ష్మీరమణులు  భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు.

తెప్పోత్సవాల్లో  భాగంగా తొలిరోజు( మార్చి 20) శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామి భక్తులను కటాక్షిస్తారు. రెండోరోజు ఉత్సవాల్లో భాగంగా  రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి వార్లు తెప్పలపై మూడుసార్లు విహరించనున్నారు. మూడో రోజు (మార్చి 22) శ్రీభూదేవి సమేతంగా మలయప్పస్వామివారు పుష్కరిణిలో ప్రత్యక్షమవుతారు. నాలుగో రోజు  ఐదుమార్లు, చివరి రోజు మార్చి 24న ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.

తెప్పోత్సవాల కారణంగా మార్చి 20, 21న  సహస్రదీపాలంకార సేవ, మార్చి 22, 23, 24న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.

google-add
google-add
google-add

ప్రభుత్వ పథకాలు

google-add
google-add
google-add

చరిత్రలో ఈరోజు

విధాత తలపు బాపు

P Phaneendra | 15:38 PM, Fri Dec 15, 2023
google-add
google-add