Friday, May 10, 2024

Logo
Loading...
google-add

స్వస్తిక పేరున్న మహిళ అకౌంట్‌పై ఊబెర్ నిషేధం... చివరకు క్షమాపణలు

T Ramesh | 10:37 AM, Sun Apr 21, 2024

భారతీయ మూలాలు ఉన్న ఓ మహిళ పట్ల ఊబెర్ అనుచితంగా ప్రవర్తించింది. స్వస్తిక అనే పేరున్న మహిళ అకౌంట్‌ను నిషేధించిన ఊబెర్, ఆ తర్వాత తప్పుతెలుసుకుని క్షమాపణలు చెప్పింది. ఆస్ట్రేలియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫీజీలో పుట్టి పెరిగిన స్వస్తిక చంద్ర ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. ఆమె గతేడాది అక్టోబర్‌లో ఊబెర్ ఈట్స్ ద్వారా ఫుడ్ ఆర్డరిచ్చేందుకు ప్రయత్నించగా ఈ ఘటన చోటుచేసుకుంది.

స్వస్తిక అనే పేరు కారణంగా ఆమె ఆర్డర్ తీసుకునేందుకు యాప్ తిరస్కరించింది. పేరు మార్చాలని పేర్కొని అకౌంట్‌పై నిషేధం విధించింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాలోని వివిధ హిందూ సంస్థల దృష్టికి తీసుకెళ్ళిన స్వస్తిక, తనకు జరిగిన అవమానాన్ని వివరించింది. హిందూ సంప్రదాయ గురించి ఊబెర్ కు వివరించింది. దీంతో క్షమాపణలు చెప్పిన ఊబెర్, ఆమె అకౌంట్‌ను యాక్టివ్ చేసింది.

హిందూ మతానికి చెందిన పదాన్ని హిట్లర్ 1920ల్లో తనకు అనుకూలంగా మార్చుకున్నాడని స్వస్తిక స్థానిక మీడియాకు వివరించారు. హిట్లర్ ఆ పదాన్ని దుర్వినియోగ పరచకముందు నుంచే హిందూ సమాజంలో స్వస్తిక్ భాగమన్నారు.

google-add
google-add
google-add

ప్రభుత్వ పథకాలు

google-add
google-add
google-add

చరిత్రలో ఈరోజు

విధాత తలపు బాపు

P Phaneendra | 15:38 PM, Fri Dec 15, 2023
google-add
google-add