Sunday, April 14, 2024

Logo
Loading...
google-add

ఏపీ డీఎస్సీ దరఖాస్తు గడువు పొడిగింపు

T Ramesh | 16:07 PM, Wed Feb 21, 2024

ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 25 రాత్రి 12 గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం కల్పించినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. హెల్ప్‌ డెస్క్‌ సమయాలను ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పొడిగించినట్లు ప్రకటనలో వివరించింది.

దరఖాస్తు చేసే సమయంలో చేసిన తప్పుల్ని సరిచేసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది.  https://apdsc.apcfss.in/ కు లాగిన్ అవ్వడం ద్వారా ఎడిట్ చేసుకోవచ్చు.

అభ్యర్థి పేరు, తాను ఎంచుకున్న పోస్టు, జిల్లా తప్ప మిగిలిన అంశాలన్నీ మార్చుకోవచ్చు. టెట్‌కు 3,17,950 మంది, డీఎస్సీకి 3,19,176 మంది ఇప్పటి వరకు దరఖాస్తు చేశారని వెల్లడించింది. 6,100 పోస్టులకు డీఎస్సీ పరీక్ష కోసం ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add
google-add
google-add

రాజకీయం

google-add
google-add