ఆంధ్రప్రదేశ్
లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగిస్తూ
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 25 రాత్రి 12 గంటల వరకు పరీక్ష ఫీజు
చెల్లించే అవకాశం కల్పించినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
హెల్ప్
డెస్క్ సమయాలను ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు
పొడిగించినట్లు ప్రకటనలో వివరించింది.
దరఖాస్తు చేసే సమయంలో చేసిన తప్పుల్ని సరిచేసుకునేందుకు
కూడా అవకాశం కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. https://apdsc.apcfss.in/ కు లాగిన్ అవ్వడం ద్వారా ఎడిట్ చేసుకోవచ్చు.
అభ్యర్థి
పేరు, తాను ఎంచుకున్న పోస్టు, జిల్లా తప్ప
మిగిలిన అంశాలన్నీ మార్చుకోవచ్చు. టెట్‌కు 3,17,950 మంది, డీఎస్సీకి 3,19,176 మంది ఇప్పటి
వరకు దరఖాస్తు చేశారని వెల్లడించింది. 6,100 పోస్టులకు డీఎస్సీ
పరీక్ష కోసం ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు