మొదటి భాగం ఇక్కడ చదవండి…
రెండవ భాగం ఇక్కడ చదవండి…
మూడవ భాగం ఇక్కడ చదవండి…
నాలుగవ భాగం ఇక్కడ చదవండి…
చివరిగా, ఐదవ భాగం….
(27) 2020 ఏప్రిల్ 1:
చైనా, భారత్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70ఏళ్ళు నిండిన సందర్భాన్ని పురస్కరించుకుని హిందూ పత్రిక మరొక ఆడ్వర్టోరియల్ ప్రచురించింది. వ్యాసం రూపంలో ఉండే ఆ ప్రకటనను చైనా దౌత్యకార్యాలయం వెలువరించింది. నిజానికి చైనా భారతదేశానికి చేసిన దాదాపు అన్ని వాగ్దానాలనూ ఉల్లంఘించింది, భారత్‌ను మోసం చేస్తూనే ఉంది. ఆ విషయాన్ని వాటంగా విస్మరించిన హిందూ పత్రిక, చైనా ఇచ్చిన పెయిడ్ కంటెంట్‌ను ప్రత్యేక పేజీగా ప్రచురించింది. దౌత్యపరంగా చైనా భారతదేశంతో గొప్ప సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు అబద్ధాలను వండివార్చింది.
(28) 2019 ఆగస్టు 22:
ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ ప్రతిపత్తిని తగ్గించడం వంటి విషయాల్లో ‘హిందూ’ పత్రిక వైఖరిని గమనిస్తే… ప్రాదేశిక సమగ్రత, స్వయంప్రతిపత్తి వంటి విషయాలపై చైనా ఆలోచనలూ హిందూ పత్రిక ఆలోచనలూ దాదాపు ఒక్కలాగే ఉన్నాయన్న విషయం అర్ధమవుతుంది. భారతదేశంలోని ప్రధానమైన పత్రికల్లో ఒకటైన ‘హిందూ’ వైఖరి అధికార కేంద్రీకరణకు అనుకూలంగా ఉండడం విస్మయాన్ని కలిగిస్తుంది. ప్రజాస్వామ్య లక్షణమైన ప్రాదేశిక వైవిధ్యం కంటె అధికార కేంద్రీకరణకు ప్రాధాన్యం ఇచ్చే చైనా వంటి దేశాల వైఖరిని ‘హిందూ’ సమర్ధించడం ఆందోళనకరం.
ప్రత్యేకించి, జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని ఇచ్చే రాజ్యాంగ అధికరణం 370ని హిందూ పత్రిక సమర్ధించడం భయం కలిగిస్తుంది. భారతదేశంలో జాతుల ఘర్షణలు తలెత్తకుండా చాలావరకూ సాయపడిన ప్రధానమైన లక్షణం ప్రాదేశిక స్వయంప్రతిపత్తిని కాపాడుకోవలసిన ప్రధానమైన అవసరాన్ని హిందూ పత్రిక విస్మరించింది.
(29) 2019 ఆగస్టు 19:
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించే 370వ అధికరణాన్ని తొలగించడాన్ని హిందూ పత్రిక ఒక వ్యాసం ద్వారా తప్పుపట్టింది. ఆ నిర్ణయం ‘ఇండియా అన్న భావన’ నుంచి పూర్తిగా వైదొలగడమే అని మండిపడింది. భిన్నత్వం, బహుళత్వం, రాజ్యాంగంపై గౌరవం అనే దార్శనికతను వదిలేస్తున్నారని విమర్శించింది. ప్రజలను సంప్రదించకుండా తీసుకునే చర్యలు సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తిని తక్కువ చేస్తాయనీ, జమ్మూకశ్మీర్ ప్రత్యేక అస్తిత్వానికి విఘాతం కలిగిస్తాయనీ ఆందోళన వ్యక్తం చేసింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రీకృత విధానం ప్రమాదకరమైన ధోరణి అని వాపోయింది. కశ్మీర్‌లో హింస మరింత పెరుగుతుందని, అక్కడ బైటివారు వెళ్ళి స్థిరపడడం ఎక్కువ అవుతుందని, ఇంకా అటువంటి దీర్ఘకాలిక దుష్ప్రభావాలు చాలా ఉంటాయనీ హిందూ పత్రిక హెచ్చరించింది.
(30) 2019 ఏప్రిల్ 26:
చైనా అప్‌డేట్ చేసుకున్న తమ దేశపు బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బిఆర్ఐ) పథకాన్ని సమర్ధిస్తూ హిందూ పత్రిక వ్యాసాన్ని ప్రచురించింది. నిజానికి బిఆర్ఐ ఆర్ధిక నమూనా చుట్టూ చైనాలోనే విమర్శలు చాలా ఉన్నాయి. వాటిని ఎదుర్కొంటూ చైనాకు అండగా నిలిచేందుకు వీలుగా హిందూ ఒక కథనరీతిని (నెరేటివ్) నిర్మించింది. ప్రపంచవ్యాప్తంగా పరస్పర సహకారం సాధించడమే బిఆర్ఐ లక్ష్యం అని ఆ వ్యాసం పొగడ్తల్లో ముంచెత్తింది.
నిజానికి పాకిస్తాన్‌లో రహదారుల నిర్మాణం కోసం బిఆర్ఐ ద్వారా చేపట్టే ప్రాజెక్టుల ద్వారా భారతదేశంలో తాము ఆక్రమించుకున్న భూభాగాన్ని పూర్తిగా కబళించివేయాలన్నది చైనా యోచన. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సిపిఇసి) మీద భారత ఆందోళనలను హిందూ పూర్తిగా విస్మరించింది. చైనా తన బిఆర్ఐ ద్వారా గ్లోబల్ గవర్నెన్స్‌ను, ఆర్థిక సహకారాన్నీ పునర్నిర్వచిస్తోందంటూ హిందూ పత్రిక ఊదరగొట్టింది. ప్రపంచ వాణిజ్యం భవిష్యత్తును, దాని అభివృద్ధినీ తీర్చిదిద్దడంలో చైనా నాయకత్వ పటిమను ఆ వ్యాసం ఆకాశానికి ఎత్తేసింది.
(31) 2018 ఆగస్టు 11:
చైనాలోని నింజియా ప్రొవిన్స్ వేజో ప్రాంతంలోని గ్రాండ్ మాస్క్ మసీదును కూల్చివేయాలని ఆ దేశం భావించింది, దానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ విషయంలో చైనా వైఖరిని సమర్ధిస్తూ హిందూ పత్రిక ఒక వ్యాసం ప్రచురించింది. ‘చట్టం కంటె ఏ మతమూ ఎక్కువ కాదు’ అని చైనా ప్రభుత్వం చేసిన వాదనను సమర్ధించేలా హిందూ పత్రిక ఒక వ్యాసం ప్రకటించింది. చైనా అధికార పత్రిక, ప్రభుత్వం నిర్వహించే గ్లోబల్ టైమ్స్‌లోని సంపాదకీయ వైఖరికి అనుగుణమైన ధోరణిలోనే ‘హిందూ’ పత్రిక వ్యాసం రాసింది. దాని ప్రకారం మసీదును కూలగొట్టడం చట్టబద్ధమైన వైఖరి అని చైనా సమర్ధన. మత స్వేచ్ఛ మీద నియంత్రణల అమలును ఆ వ్యాసం స్పష్టంగా సమర్ధించింది.
అలాంటి ప్రమాదకర వైఖరీ, ఆలోచనా ధోరణీ కలిగి ఉన్న హిందూ పత్రిక, భారతదేశానికి వ్యతిరేకంగా, చైనాకు అనుకూలంగా వ్యవహరించడం కొత్తేమీ కాదని పైన ఉన్న ఉదాహరణలను బట్టి అర్ధమవుతుంది.
(సమాప్తం)