తూర్పు ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైంది. లెవోటోబి లకిలకి అగ్నిపర్వతం సోమవారం పెద్దశబ్దంతో బద్దలైంది. ఫ్లోర్స్ దీవిలోని మౌంట్ లెవోటోబి లకిలకిలో విస్ఫోటనాలు చోటు చేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. అగ్నిపర్వతం బిలం నుంచి 6 కి.మీ మేర బూడిద ఎగసిపడుతోంది. సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మాస్కులు ధరించాలని సూచించారు.
అగ్ని పర్వతం బద్దలు కావడంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రామాలు ఖాళీ చేయించి, ప్రజలను తరలించారు. అగ్నిపర్వతం నుంచి అత్యంత వేడితో కూడిన బూడిద ఎగసిపడుతోందని వోల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మెటిగేషన్ అధికారులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు పడితే మరింత ప్రమాదమని ఇండోనేషియా జియోలాజికల్ ఏజన్సీ అధిపతి ముహమ్మద్ వాఫిద్ చెప్పారు. వర్షాల పడితే అగ్నిపర్వతం చుట్టూ ఉన్న ప్రాంతాలకు మరింత ప్రమాదమని ఆందోళన చెందుతున్నారు.