బంగ్లాదేశ్, భారత్ మధ్య సరకుల రవాణాలో ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఇటీవల కాలంలో ఈశాన్య రాష్ట్రాల నుంచి బంగ్లాదేశ్ సరకుల దిగుమతి నిలిపివేసింది. ప్రతిగా భారత్ చర్యలకు దిగింది. బంగ్లాదేశ్ నుంచి ప్రధానంగా భారత్‌కు దిగుమతి అయ్యే వస్త్రాలపై ఆంక్షలు విధించింది. దీంతో బంగ్లాదేశ్ ప్రధాని ఓ ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ ఉత్పత్తులపై భారత్ కొన్ని ఆంక్షలు విధించినట్లు వార్తల ద్వారా తెలిసిందన్నారు. వాణిజ్యంలో ఉన్న ఇబ్బందులను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని బంగ్లాదేశ్ వాణిజ్య సలహాదారు షేక్ బషీరుద్ధీన్ మీడియాకు వెల్లడించారు.
భారత్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం అందలేదు. ఏదైనా సమస్య ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం. అఖౌరా, డాకి పోర్టులతో పాటు సరిహద్దు ప్రాంతాల ద్వారా అయ్యే ఎగుమతి, దిగుమతులపై భారత్ కొన్ని ఆంక్షలు విధించింది.వస్త్ర తయారీలో భారత్ నెంబర్ వన్. అయినా బంగ్లాదేశ్ నుంచి కొన్ని వస్త్రాలు దిగుమతి చేసుకుంటోంది. అది మా సామర్థ్యాన్ని తెలియజేస్తోంది.వాణిజ్యంలో కొన్ని పరిమితులు ఉంటాయి. సమస్యలను చర్చల ద్వారా సర్దుబాటు చేసుకుంటామని బంగ్లాదేశ్ ప్రకటించింది.
పత్తి, నూలు, ప్లాస్టిక్, పీవీసీ, ఆహార పదార్థాలు, కార్బోనేటెడ్ డ్రింక్స్ ముంబై, కోల్‌కతా పోర్టుల ద్వారా మాత్రమే దిగుమతులకు అనుమతిస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి దిగుమతి అయ్యే చేపలు, వనస్పతి నూనె,ఎల్పీజీలకు ఆంక్షల లేవని భారత్ స్పష్టం చేసింది.