సినిమా ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాల ప్రదర్శన తమకు గిట్టుబాటు కావడం లేదని, సినిమా ఆదాయంలో పర్సెంటేజ్ ఇస్తేనే థియేటర్లలో బొమ్మ ఆడిస్తామని తేల్చి చెప్పారు. జూన్ నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నట్లు హైదరాబాద్‌లో ఇవాళ సమావేశమైన 62 మంది ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ ఎగ్జిబిటర్లు దగ్గుబాటి సురేశ్ బాబు, దిల్ రాజు వీరికి నాయకత్వం వహించారు. సినిమాల ప్రదర్శన గిట్టుబాటు కావడం లేదని, నిర్మాతలు సినిమా ఆదాయంలో పర్సెంటేజ్ ఇస్తేనే థియేటర్లు నడుస్తాయని వారు తేల్చి చెప్పారు.