వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గంలో అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారంటూ మైనింగ్ ఏడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ తవ్వకాలకు సంబంధించిన నివేదికను పోలీసు అధికారులకు అందించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2024 మే వరకు వల్లభనేని వంశీ ఆయన అనుచరులు జరిపిన అక్రమ తవ్వకాల వివరాలను నివేదికలో అందజేశారు. సుమారు రూ.100 కోట్ల విలువైన మట్టి తవ్వకాలు జరిపారని ఏడీ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే పలు కేసుల్లో రిమాండులో వున్న వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు చేయడం చర్చకు దారితీసింది.