పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఇజ్రాయెల్ తాజాగా పాలస్తీనాలోని ఖాన్ యూనిస్ నగరంపై యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. తాజా దాడుల్లో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖతారీ టెలివిజన్ నెట్‌వర్క్‌కు చెందిన ఓ విలేకరి సహా, ఆయన కుటుంబంలోని 11 మంది చనిపోయారు.
ఇటీవల అమెరికా చొరవతో పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా బందీగా ఉన్న ఓ వ్యక్తిని హమాస్ ఉగ్రవాదులు విడుదల చేశారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు పశ్చిమాసియాలో పర్యటించనున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులకు ప్రాధాన్యత ఏర్పడింది.
హైతీ ఉగ్రవాదుల దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. యుద్ధం ముగించడానికి తమ వద్ద ఎలాంటి మార్గాలు లేవన్నారు. తమపై దాడి చేసిన హైతీ ఉగ్రవాదులను మట్టుబెడతామని హెచ్చరించారు. బుధవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 70 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు గతంలో ఐడీఎఫ్ దాడులను గుర్తుచేసుకోవాలని నెతన్యాహు హెచ్చరించారు. ఈ సారి దాడులు మామూలుగా ఉండవన్నారు.