పహల్గాం ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తొయ్యబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంన్స్ ఫ్రంట్ ఉగ్రదాడికి బాధ్యత వహించింది. టీఆర్ఎఫ్‌ను భారత్ ఇప్పటికే ఉగ్ర సంస్థగా ప్రకటించింది. ప్రపంచ దేశాలు కూడా టీఆర్ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించే ప్రయత్నాలు భారత్ ప్రారంభించింది. ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలతో భారత్ సంప్రదింపులు జరుపుతోంది.యూఎన్ ఆఫీస్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం, కౌంటర్ టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్‌తో భేటీ అయింది.
టీఆర్ఎఫ్ పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయ్యబాకు అనుబంధంగా పనిచేస్తోంది. జమ్ముకశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు తరవాత ఈ సంస్థ పుట్టుకొచ్చింది. 2019 అక్టోబరులో ఏర్పాటైన టీఆర్ఎఫ్‌కు షేక్ సాజిద్ గుల్ నాయకత్వం వహిస్తున్నారు. చీఫ్ ఆపరేషనల్ కమాండర్‌గా బాసిత్ అహ్మద్ దార్ వ్యవహరిస్తున్నారు. లష్కరే తొయ్యబా ఉగ్ర సంస్థలో మాజీ సభ్యులతో టీఆర్ఎఫ్ ఏర్పడింది.
2023లో టీఆర్ఎఫ్‌ను కేంద్రం ఉగ్ర సంస్థగా ప్రకటించింది. ఆన్‌లైన్ ద్వారా యువతను నియమించుకోవడం, వారికి శిక్షణ ఇచ్చి ఉగ్ర వాద కార్యక్రమాలకు పాల్పడుతోంది. యువతకు ఆయుధాలు సరఫరా చేయడం జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడులకు దిగడంతో కేంద్ర టీఆర్ఎఫ్‌ను నిషేధించింది.