మణిపుర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బుధవారం రాత్రి చందేల్ జిల్లాలో బలగాలు జరిపిన కాల్పుల్లో 10 మంది తీవ్రవాదులు హతమయ్యారు. భారత్ మయన్మార్ సరిహద్దు జిల్లా చందేల్‌లోని ఖెంగ్‌జోయ్ తహసీల్ సమీపంలోని న్యూ సమతాల్ గ్రామ సమీపంలో ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. మిలిటెంట్ల కదలికలపై అస్సాం రైఫిల్స్ కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.
అస్సాం రైఫిల్స్ తనిఖీలు జరుపుతుండగా మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. ఎదురు కాల్పుల్లో 10 మంది మిలిటెంట్లు చనిపోయినట్లు సైన్యం తెలిపింది. వారి వద్ద నుంచి తుపాకులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.