తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు, నాయకులు ఇవాళ సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాల గురించి, కేంద్రీయ విశ్వవిద్యాలయం భూముల వ్యవహారాలకు సంబంధించి మహిళా మోర్చా కార్యకర్తలు తెలంగాణ సెక్రటేరియట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే వారిని సచివాలయం దక్షిణ ద్వారం దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో పోలీసులకు మహిళా మోర్చా కార్యకర్తలకూ మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు బీజేఎంఎం కార్యకర్తలను, మహిళా నేతలనూ నిర్బంధించి. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆ క్రమంలో సెక్రటేరియట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మరోవైపు, సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర విద్యార్ధులు, అధ్యాపకుల ఆందోళనలు ఇవాళ కూడా కొనసాగాయి. వారు వర్సిటీ గేటు లోపల నుంచే ఆందోళనలు చేసారు. ప్రభుత్వం చదును చేస్తున్న 400 ఎకరాల భూముల వద్దకు చేరుకోడానికి ప్రయత్నించిన విద్యార్ధులను అక్కడికక్కడే అడ్డుకున్నారు.