రాష్ట్రంలో ఉపాధి కల్పన కోసం తీసుకొస్తున్న పరిశ్రమలను అడ్డుకునే వారి పేర్లను రెడ్ బుక్ లోకి ఎక్కిస్తామని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. వైఎస్ఆర్‌సిపి నాయకులు పని చేయరు, చేసే వారిని చేయనీయకుండా అడ్డుకుంటారు అని మండిపడ్డారు.
ప్రకాశం జిల్లా దివాకరపల్లి గ్రామంలో రిలయన్స్ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ల శంకుస్థాపన చేసిన సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ తప్పుడు ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే ఐదేళ్ళలో 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఇప్పటివరకూ రూ.8లక్షల కోట్ల పెట్టుబడులతో 5లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు జరిగాయన్నారు. అందులో భాగంగా రిలయన్స్, ఎన్‌టీపీసీ, బీపీసీఎల్, టాటాపవర్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, సీబీజీ, మిట్టల్ కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని లోకేష్ చెప్పారు.