ఎండలు ఒక్కసారిగా మంటలు పుట్టిస్తున్నాయి. సగటు కన్నా ఒకేసారి 4 డిగ్రీల ఉష్ణోగ్రత అదనంగా నమోదైంది. 150 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ప్రకాశం జిల్లా కొమరోలు, నంద్యాల, కమలాపురంలో ఇవాళ అత్యధికంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనకాపల్లి, రుద్రవరం, ఎస్. కోటలో 42 డిగ్రీలు కర్నూలు జిల్లా కోసిగి, శ్రీకాకుళం జిల్లా మిళియాపుట్టు, సత్యసాయి జిల్లా తాడిమర్రి సబ్బవరం, వీరఘట్టంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అనంతపురం జిల్లా గుంతకల్లు, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం, తిరుపతి, నెల్లూరుల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చిత్తూరు, మచిలీపట్నం, నరసరావుపేట, ఏలూరు ప్రాంతాల్లో 39 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.