ఆర్జికర్ ఆసుపత్రిలో డాక్టర్ హత్యాచారం దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆగష్టు 9 రాత్రి విధుల్లో ఉన్న డాక్టర్‌పై దుండగుడు అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో సంజయ్ రాయ్‌కు స్థానిక కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మరలా సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కొట్టివేశారు. కోల్‌కతా హైకోర్టులో కేసును కొనసాగించవచ్చని తీర్పు చెప్పారు.
ఆర్జికర్ కేసులో సంజయ్ రాయ్‌కు మరణ శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. బెంగాల్ ప్రభుత్వ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసు విచారించిన సీబీఐ కూడా హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ సాగుతోంది.