పెను ప్రమాదం తప్పింది. అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేట వద్ద రైలు వంతెన కుంగింది. విశాఖపట్నం విజయవాడ మార్గంలో పలు రైళ్లను రద్దు చేశారు. విశాఖ, సింహాద్రి, గోదావరి, అమరావతి, గరీబ్రధ్, మహబూబ్నగర్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని రైళ్లు రద్దు చేశారు.
ప్రయాణీకుల సౌకర్యార్థం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో సమాచార కేంద్రం ఏర్పాటు చేశారు. రైళ్ల సమాచారం కావాల్సిన వారు 0891 2746330, 0891 2744619, 87126 41255 నెంబర్లకు కాల్ చేయాలని రైల్వే అధికారులు సూచించారు. కుంగిన రైల్వే వంతెన పనులను రైల్వే ఇంజనీర్లు పర్యవేక్షిస్తున్నారు. అతి భారీ వాహనం రైల్వే వంతెన గడ్డర్ను తాకడంతో కుంగినట్లు తెలుస్తోంది.