ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్త అయిన హిమానీ నగర్వాల్ అనే మహిళ హత్యకు గురైంది. ఆమె శవం సూట్‌కేసులో దొరికింది. ఆ కేసుకు సంబంధించి పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసారు. నిందితుడి దగ్గర నుంచి మృతురాలి డబ్బులు, నగలు కూడా లభించాయి.
శవం ఉన్న సూట్‌కేసు హర్యానా రాష్ట్రంలోని రోహ్‌తక్ వద్ద శనివారం లభించింది. ఆమె మృతదేహాన్ని ఆదివారం పోలీసులకు కుటుంబ సభ్యులు అందించారు. అయితే శవాన్ని పూడ్చిపెట్టడానికి తల్లిదండ్రులు మొదట ఒప్పుకోలేదు. ఆ కేసులో నిందితులను అరెస్ట్ చేసేంతవరకూ అంతిమ సంస్కారాలు జరపబోమని బంధువులు చెప్పారు.
హిమానీ నగర్వాల్ వయసు 20యేళ్ళ లోపే. కాంగ్రెస్‌లో ఆమె వేగంగా ఎదురుతోంది. రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో కూడా పాల్గొంది.