సైబర్ నేరగాళ్లు కొత్త అవతారం ఎత్తారు. మాట వినని వారి పీఎఫ్ ఖాతాలను బోగస్ కంపెనీలకు లింకు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కూడా వెలుగు చూశాయి. ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతున్న సైబర్ నేరగాళ్లు, మాట వినకపోతే పీఎఫ్ ఖాతాలకు బోగస్ కంపెనీలను లింకు చేస్తున్నారు. దీంతో పీఎఫ్ ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఫిర్యాదులు వేలల్లో రావడంతో ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
యూఏఎన్ నెంబరు కలిగిన పీఎఫ్ ఖాతాదారులు స్వయంగా బోగస్ కంపెనీలను డీలింకు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఖాతాదారులు యూఏఎన్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిన తరవాత హిస్టరీ బటన్ క్లిక్ చేయాలి. ఆ తరవాత ఏఏ కంపెనీలకు మీ పీఎఫ్ ఖాతా లింకు అయి ఉందో చెక్ చేసుకోవాలి. బోగస్ కంపెనీలు ఉంటే, డీలింకుపై క్లిక్ చేయాలి. ఆధార్ అనుసంధాన ఫోన్ నెంబరుకు పిన్ వస్తుంది. అది ఎంటర్ చేయగానే డీలింకు అవుతుంది.
కొత్త సదుపాయంతో సైబర్ నేరగాళ్ల ఆటకట్టించినట్లైంది. పీఎఫ్ ఖాతాదారులు త్వరలో సొమ్మును యూపీఐ ద్వారా కూడా తీసుకునే సదుపాయం అందుబాటులోకి రాబోతోంది. దీనిపై యూపీఐ పేమెంటు నిర్వహణా సంస్థ చర్చలు జరుపుతోంది. ఏప్రిల్ నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.
రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత