తెలంగాణ ఉపాధ్యాయుడి ప్రతిభను మన్ కీ బాత్ వేదికగా ప్రధాని మోదీ అభినందించారు. మన్‌కీ బాత్ 119వ ఎపిసోడ్ లో జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని …తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ ఉపాధ్యాయుడు తొడసం కైలాష్ గిరిజన భాషలను కాపాడడంలో తోడ్పాటు అందించాడని చెప్పారు. ఏఐ సాధనాలను ఉపయోగించి కొలామి భాషలో పాటను కైలాష్ కంపోజ్ చేశారని ప్రశంసించారు. AI రంగంలో భారత్ సాధించిన ప్రగతిని ప్రపంచమంతా కొనియాడిన విషయాన్ని గుర్తు చేశారు.
అంతరిక్షం, కృత్రిమ మేధ(AI)రంగాల్లు యువత భాగస్వామ్యం పెరగడం ద్వారా కొత్త విప్లవానికి నాందిపలికామన్నారు. కొత్తకొత్త సాంకేతికతను ప్రయత్నించడంలో భారత్ ఎవరికీ తీసుపోదన్నారు. ఇస్రో 100వ రాకెట్ ను ప్రయోగించిన విషయాన్ని మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. గత పదేళ్ళలో ఇస్రో 460 ఉపగ్రహాలను ప్రయోగించిందన్నారు.
దేశ స్వాతంత్ర్య పోరాటం, రాజ్యాంగ రూపకల్పనలో మహిళల పాత్ర కీలకమన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వారి జీవితాల్లో ప్రేరణ నింపేందుకు ఒకరోజుపాటు తన సోషల్ మీడియా ఖాతాను అంకితమిస్తా అన్నారు.