టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్
రోహిత్ సేన ఫీల్డింగ్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ 5 లో భారత్, పాకిస్తాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ ఓడింది. పాకిస్తాన్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు భారత్ వరుసగా 12 సార్లు టాస్ ఓడింది. గతంలో నెదర్లాండ్స్ 11 సార్లు టాస్ కోల్పోయింది.
పాకిస్తాన్ ఇన్నింగ్స్ ను ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజామ్ ప్రారంభించగా తొలి ఓవర్ ను షమీ వేశాడు. అయితే ఏకంగా ఐదు వైడ్ల వేసి ఒక పరుగు ఇవ్వడంతో పాకిస్తాన్ తొలిఓవర్ లో ఆరు పరుగులు సాధించింది. రెండో ఓవర్ కు పది పరుగులు, మూడో ఓవర్ కు 14 పరుగులుగా పాకిస్తాన్ స్కోర్ ఉంది. ఐదు ఓవర్లు పూర్తయ్యే సరికి పాకిస్తాన్ వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. షమీకి గాయం కావడంతో వాషింగ్టన్ సుందర్ ఫీల్డింగ్ కు దిగాడు. ఆ తర్వాత బాల్ ను పాండ్య అందుకున్నాడు. మరో ఎండ్ లో అక్షర్ పటేల్ ఎంట్రీ ఇచ్చాడు.
పాండ్యా బౌలింగ్ లో బాబర్ ఆజామ్(23) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఇంజిమామ్ ఉల్ హక్ (10)ను అక్షర్ పటేల్ రనౌట్ చేసి పెవిలియన్ కు పంపాడు. దీంతో పాకిస్తాన్ పది ఓవర్లకు రెండు వికెట్లు నష్టపోయి 52 పరుగులు చేసింది.