పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం విషమించింది. శనివారం ఆయన ఆరోగ్యం విషమించడంతో రోమ్‌లోని గెమిల్లీ ఆసుపత్రికి తరలించారు. గత వారం నుంచి ఆయన ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎనీమియా కూడా ఉన్నట్లు గుర్తించారు. ఆయన ఆరోగ్యం ఆదివారం నాటికి మరింత విషమించింది.
పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యంపై ఇప్పుడేమీ స్పందించలేమని వాటికన్ ఓ ప్రకటన విడుదల చేసింది. శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు, న్యూమోనియాకు వైద్యులు వైద్యం అందిస్తున్నారు.త్వరలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై బులెటన్ విడుదల చేసే అవకాశముంది. పోప్ ఆరోగ్యం విషమంగా ఉందని వాటికన్ ప్రకటించింది. ఆయన ప్రమాదం నుంచి ఇంకా బయటపడలేదని వ్యక్తిగత ఫిజీషియన్ లూగీ కార్బొన్ ప్రకటించారు.
ఆయన గత రాత్రి బాగానే నిద్రపోయినట్లు వెల్లడించారు. దక్షిణార్థ గోళం నుంచి పోప్ అయిన మొదటి వ్యక్తి ఫ్రాన్సిస్. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో 1936లో జన్మించిన ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 2013లో నాటి పోప్ బెనెడిక్ట్ 16 రాజీనామాతో ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చి అధిపతి అయ్యారు.