నామ్ తమిళర్ కట్చి కో ఆర్డినేటర్ తనను పెళ్లి చేసుకుంటానంటూ మోసం చేయడంతో నటి విజయలక్ష్మికి ఏడుసార్లు అబార్షన్ జరిగిందని, ఇది చాలా తీవ్రమైన కేసని సీమాన్‌పై హైకోర్టు న్యాయమూర్తి తన తీర్పులో వెల్లడించారు. నటి విజయలక్ష్మిని లైంగిక వేధింపులకు గురిచేసినట్లు సీమాన్‌పై 2011లో కేసు నమోదు చేశారు.
తనపై అక్రమంగా కేసు పెట్టారని, కొట్టివేయాలంటూ సీమాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ ఇళంతిరైయన్ డిస్మిస్ చేశారు. కేసు రద్దు చేయడం కుదరదని తీర్పులో వెల్లడించారు. 12 వారాల్లో తుది నివేదిక దాఖలు చేయాలంటూ పోలీసు అధికారులను ఆదేశించారు.ఈ కేసుపై న్యాయమూర్తి వివరణాత్మక తీర్పు వెలువరించారు.
దర్శకనటుడు, ప్రస్తుత రాజకీయ నాయకుడు సీమాన్ గతంలో దర్శకత్వం వహించిన చిత్రంలో విజయలక్ష్మి నటించారు. వివాహం చేసుకుంటానని మోసం చేసి లైంగిక సంబంధం పెట్టుకున్నాడని నటి ఆరోపించారు. ఇరువురి ఆమోదం మేరకే అబార్షన్ చేయించినట్లు సీమాన్ చెప్పుకొచ్చారు. తన తప్పులేదని ఆయన వాదిస్తున్నారు. ఒత్తిడి, బెదిరింపులతో సీమాన్‌పై కేసులను నటి విజయలక్ష్మి వెనక్కు తీసుకున్నారు. అయితే కేసును రద్దు చేయడం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది. లైంగిక వేధింపుల కేసు రద్దు చేయడం కుదరదని న్యాయమూర్తి తీర్పులో స్పష్టం చేశారు.