బలవంతపు మతమార్పిళ్ళు అడ్డుకట్ట వేసే ప్రక్రియలో భాగంగా లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకురాబోతుది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి రాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కూడిన ఓ ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీకి రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) సంజయ్ వర్మ నేతృత్వం వహిస్తారు. ప్యానెల్‌లో మహిళా శిశు సంక్షేమం, మైనారిటీ వ్యవహారాలు, న్యాయవ్యవస్థ, సామాజిక న్యాయం, హోమ్ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఉన్నారు.
రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, చట్టాలను అధ్యయనం చేసి ‘లవ్ జిహాద్’, మోసం, బలవంతపు మతమార్పిడికి అడ్డుకట్ట వేసే చర్యలను సూచించే ఓ ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తుంది. ‘లవ్ జిహాద్’ సంఘటనలకు సంబంధించిన చట్టపరమైన, సాంకేతిక అంశాలను పరిశీలించి సమగ్ర నివేదికను కమిటీ అందజేయనుంది.
‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు చట్టాలు చేసి అమలు చేస్తున్నాయి.