అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ నిర్యాణం చెందారు. సత్యేంద్ర దాస్ 85 ఏళ్ల వయస్సులో అస్తమించారు. అనారోగ్యానికి లఖ్‌నవూలోని ఎస్జీపీజీఐలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
మధుమేహం, రక్తపోటుతో కొన్నాళ్ళుగా బాధపడుతున్న సత్యేంధ్ర దాస్ ఆదివారం ఆస్పత్రిలో చేరారు. చికిత్స కొనసాగుతుండా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో బుధవారం కన్నుమూశారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో సత్యేంధ్ర దాస్ ముఖ్యపాత్ర పోషించారు. నిర్వాణి అఖాడాలో 20 ఏళ్ల వయస్సులో చేరారు. బాబ్రీ కట్టడం కూల్చివేత సమయంలో రాముడు సహా ఇతర విగ్రహాలను ఫకీరే మందిరానికి తరలించి పూజలు నిర్వహించారు. తాత్కాలిక రామమందిరంలోనూ పూజారిగా సేవలిందించారు.
సత్యేంధ్రదాస్ మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు సోషల్ మీడియావేదికగా అంజలిఘటించారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.