జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.అజయ్ భల్లాను కలిసిన బీరెన్ సింగ్ తన రాజీనామా పత్రం అందజేశారు.
మణిపూర్ కు సీఎంగా వ్యవహరించడం తనకు దక్కిన గౌరవమన్న బీరెన్ సింగ్, పదవీకాలంలో తనకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో మణిపూర్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని భవిష్యత్ లో మరింతగా జరుగుతున్నాయన్నారు.
రాజీనామాకు ముందు బీరెన్ సింగ్ దిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ ప్రధాన వ్యూహకర్త అమిత్ షాతో సమావేశం అయ్యారు. సాయంత్రానికి బీరెన్ సింగ్ రాజీనామా ప్రకటించారు.
2023 మే నుంచి మణిపూర్ లో జాతుల మధ్య వైరం జరుగుతోంది. పరస్పర దాడులకు పాల్పడుతున్నారు. పెద్దసంఖ్యలో దాడులు జరిగాయి.
మణిపూర్ అసెంబ్లీలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 60 కాగా బీజేపీకి 37 మంది ఉన్నారు. మరో ఎనిమిది మంది ఇతర ఎమ్మెల్యేలు కూడా బీజేపీకు మద్దతు తెలిపారు.