మహిళల అండర్ -19 టీ 20 ప్రపంచకప్-2025 టోర్నీలో భాగంగా కౌలాలంపూర్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. విండీస్ పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది రికార్డు సృష్టించింది.
టాస్ నెగ్గి ఫీల్డిండ్ ఎంచుకున్న భారత మహిళల జట్టు, విండీస్ ను స్వల్ప స్కోర్ కే పెవిలియన్ కు పంపింది. 13.2 బంతులు ఆడిన విండీస్, 44 పరుగులకు ఆలౌటైంది. విండీస్ విధించిన 45 పరుగుల లక్ష్యాన్ని భారత్, ఒక వికెట్ నష్టపోయి 4.2 ఓవర్లలోనే సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్, భారత్ బౌలర్లను ఎదుర్కొనేందుకు నానా తంటాలు పడింది. కెనికా కాసర్ (15) తర్వాత ఓపెనర్ అసబి క్యాలెండర్ (12) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఐదుగురు డకౌట్ గా వెనుదిరిగారు. ఇద్దరు ఒక్కో పరుగు చేసి ఔట్ అయ్యారు. సమర రామనాథ్ (3), నైజాన్ని (0), జహ్జరా(0), బ్రియన్ని(0), అబిగేల్(1), అమైయ్(1), క్రిస్టెన్ (0), సెలెనా(0) , అమృత(4*) విఫలం అయ్యారు.
భారత బౌలర్లలో పరుణికా సిసోదియా మూడు వికెట్లు తీయగా, జోషిత, ఆయుషి శుక్లా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
విండీస్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని భారత్ 4.2 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి సాధించింది. గొంగడి త్రిష (4) విఫలమైనా కమిలిని (16*), సానికా చాల్కే (18*) భారత్ కు విజయాన్ని అందించారు.
విండీస్ బౌలర్ జహ్జరాకు ఒక వికెట్ దక్కింది.