మహా కుంభమేళాకు సంబంధించిన స్పేస్ వ్యూ చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. భక్తుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలు, హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సేకరించిన చిత్రాల్లో తెలుస్తోంది. తాత్కాలిక టెంట్ హౌస్‌లు, తేలియాడే వంతెనలతో గతానికి ఇప్పటికి తేడా స్పష్టంగా ఆ చిత్రాల్లో తెలుస్తోంది.
ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేసిన శివాలయ పార్క్ కూడా ఆ దృశ్యాల్లో కనిపించింది. 2024 ఏప్రిల్ 6న ఫొటోలో ఆ ప్రాంతమంతా ఖాళీగా కనిపించగా 2024డిసెంబర్ 22, 2025 జనవరి 10 చిత్రాల్లో వివిధ మౌలిక సదుపాయాలతో పాటు అక్కడి శివాలయ పార్క్ కూడా దర్శనమిచ్చింది. భారతదేశం మ్యాప్‌లా అది కనిపించడం విశేషం.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళా తో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కళకళలాడుతోంది. జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 వరకు జరగనుంది.