స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక ప్రకటన చేసింది. సైబర్ నేరాలు రోజురోజుకు పెరగడంతో యోనో యాప్ వినియోగంపై కీలక సూచనలు చేసింది. ఆండ్రాయిడ్ 11, అంతకంటే తక్కువ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న స్మార్ట్ ఫోన్లలో త్వరలోనే యోనో సేవలు నిలిపి వేస్తామని తెలిపింది.
ఎస్‌బీఐ ఖాతాదారులు కొత్త వెర్షన్ మొబైల్‌కి మారాలంటూ ఖాతాదారులకు మెసేజ్ లు పంపుతోంది. ఆండ్రాయిడ్ 12 అంతకంటే ఎక్కువ వెర్షన్ మొబైల్‌కి అప్‌గ్రేడ్ కావడానికి ఫిబ్రవరి 28 వరకు గడువు ఉన్నట్లు వివరించింది.
పాత వెర్షన్ మొబైల్స్‌లో మార్చి 1 నుంచి యోనో సేవలు నిలిచిపోనున్నాయి. ఖాతాదారుల భద్రత, సైబర్ నేరాల కట్టడిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.