ఇస్రో చేపట్టిన రెండు ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియ విజయవంతమైంది. మూడు సార్లు వాయిదా పడిన ఈ ప్రక్రియను ఇస్రో నేడు పూర్తి చేసింది.
స్పేడెక్స్ ప్రయోగంలో భాగంగా గత ఏడాది డిసెంబర్ 31న రెండు ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన వాహకనౌక, టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వాటిని స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ (స్పేడెక్స్)పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేశారు.
గగన్ యాన్ , జాబిల్లి నుంచి మట్టిని తీసుకురావడం, స్పేస్ సెంట్ ఏర్పాటుకు వ్యోమ నౌకల డాకింగ్, అన్ డాకింగ్ సాంకేతికత అవసరం. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో ఈ సాంకేతికతను కలిగిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. అమెరికా, రష్యా, చైనా దేశాలు ఇప్పటికే ఈ సాంకేతికతను కలిగి ఉన్నాయి.