ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ గా డాక్టర్ కొత్త మధుమూర్తిని రాష్ట్రప్రభుత్వం నియమించింది. మధుమూర్తి ఛైర్మన్ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇప్పటి వరకు ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా ఉన్న రాంమోహనరావును ప్రభుత్వం రిలీవ్ చేసింది.
మధుమూర్తి… ప్రస్తుతం వరంగల్ ఎన్‌ఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ సీనియర్ ప్రొఫెసర్‌గా, పాలకమండలి సభ్యుడిగా ఉన్నారు.
గుంటూరు జిల్లా తెనాలి మండల పరిధిలోని జాగర్లమూడికి చెందిన మధుమూర్తి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీ టెక్, వరంగల్ ఎన్‌ఐటీ నుంచి ఎంటెక్ , పీహెచ్‌డీ పట్టాలు అందుకున్నారు.
మధుమూర్తి తండ్రి కోటేశ్వరరావు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా , వరంగల్ ఎన్‌ఐటీ ప్రిన్సిపల్‌గా సేవలందించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు