హోంశాఖ ఎవరిదగ్గరంటే….?
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మంత్రులకు శాఖలు కేటాయించారు. కీలకమైన హోంశాఖ తో పాటు సాధారణ పరిపాలన, విద్యుత్, న్యాయ, సమాచార పౌర సంబంధాల శాఖలను ఫడ్నవీస్ తన ఆధీనంలోనే ఉంచుకున్నారు.
శివసేన చీఫ్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకి పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ, ప్రజా పనుల శాఖలు కేటాయించారు. ఎన్సీపీ చీఫ్, మరో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు ఆర్ధిక, ఎక్సైజ్ శాఖలు అప్పగించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి చంద్రశేఖర్ బావన్కులేకు రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించారు.
రాధాకృష్ణ- జలవనరులు (గోదావరి – కృష్ణ లోయ అభివృద్ధి కార్పొరేషన్) శాఖ
హసన్ మియాలల్ – వైద్య విద్య
చంద్రకాంత్ సరస్వతి- ఉన్నత, సాంకేతిక విద్య, శాసనసభ వ్యవహారాలు,
గిరీశ్ గీతా దత్తాత్రేయ మహాజన్ – జలవనరులు (విదర్భ, తాపీ, కొంకణ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్), విపత్తు నిర్వహణ శాఖలు
గణేశ్ నాయక్- అడవులు
గులాబ్రావ్ పాటిల్- నీటి సరఫరా, పారిశుధ్యం
దాదాజీ రేష్మాబాయి దగదుజీ బూసే- పాఠశాల విద్య
సంజయ్ రాథోడ్- నేల, నీటి సంరక్షణ
ధంజయ్ ముండే- ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ
మంగళ్ ప్రభాత్ లోథా – నైపుణ్యాభివృద్ధి, ఉపాధి
ఉదయ్ సమంత్- పరిశ్రమలు, మరాఠీ భాష
జయకుమార్ రావల్- మార్కెటింగ్, ప్రోటోకాల్
పంకజా ముండే- పర్యావరణం, వాతావరణ మార్పు, జంతు సంరక్షణ
అతుల్ సేవ్- ఓబీసీ సంక్షేమం, డెయిరీ డెవలప్ మెంట్
అశోక్ ఉయికే- గిరిజన అభివృద్ధి
శంభురాజ్ దేశాయ్- టూరిజం, మైనింగ్
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు