దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు జారీ చేసింది. వ్యూహం సినిమా వీడియోకు ఒక్కో వ్యూకు వంద చెల్లించేలా ఒప్పందం చేసుకున్న వర్మకు, ఫైబర్ నెట్ నుంచి రూ.కోటి 15 లక్షలు అదనంగా తీసుకున్నారని నోటీసులు జారీ చేశారు. అదనంగా తీసుకున్న మొత్తం వెంటనే చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ నుంచి రూ. 2 కోట్లకుపైగా వర్మకు చెల్లించినట్లు సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి ఆరోపించారు.
వ్యూహం సినిమా డైరెక్టర్ రాంగోపాల్వర్మతోపాటు, చిత్ర బృందానికి కూడా నోటీసులు జారీ చేశారు. వ్యూహం సినిమాకు ఒక్కో వ్యూకు రూ.11 వేలు చెల్లించారని గుర్తించారు. అప్పటి సంస్థ ఎండీకి కూడా నోటీసులు జారీ చేశారు. వడ్డీతో సహా 15 రోజల్లో చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై రాంగోపాల్ వర్మ స్పందించాల్సి ఉంది.