పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. శనివారంనాడు యెమన్‌పై ఇజ్రాయెల్ ఐడీఎఫ్ దళాలు భీకర దాడులు చేశాయి. ప్రతిగా హౌతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై ప్రొజెక్టైల్ క్షిపణి ప్రయోగించారు. క్షిపణిని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ సైన్యం విఫలమైంది. దీంతో క్షిపణి టెల్ అవీవ్‌లో జనావాసాలపై పడింది. 14 మంది పౌరులు గాయపడ్డారని ఐడీఎఫ్ ప్రకటించింది. హౌతీ దాడులకు ప్రతిదాడులు తప్పవని ఇజ్రాయెల్ సైనిక అధికారి డేనియల్ హగారి హెచ్చరించారు.
ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రదాడుల తరవాత మొదలైన యుద్ధం నేటికీ ముగింపు దశకు చేరుకోలేదు. కాల్పుల విరమణకు ఈజిప్టు, ఖతర్ దేశాలు చేస్తోన్న మధ్యవర్తిత్వం ఫలించలేదు. ఉగ్రవాదులందరినీ ఏరివేసే వరకు యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తెల్చి చెప్పారు. షరతులు లేకుండా బందీలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజాగా మరోసారి పశ్చిమాసియా భగ్గుమంది. ఇరాన్ సరఫరా చేసిన ఆయుధాలతో యెమెన్ నుంచి హౌతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగుతున్నారు. ఇప్పటికే ఇరాన్, లెబనాన్, యెమన్ ఉగ్రవాదులకు పరోక్షంగా ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి. ఒకవైపు హైతీ ఉగ్రదాడులను ఎదుర్కొంటూనే, హమాస్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఐడీఎఫ్ దాడులను కొనసాగిస్తోంది.