ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని
జైపూర్ అజ్మీర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. గ్యాస్ ట్యాంకర్ ట్రక్కు ఢీకొనడంతోపాటు పొగ మంచు కారణంగా 30 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. వందలాది వాహనాలకు మంటలు అంటుకున్నాయి. సమీపంలో ఇళ్లుకూడా కాలిపోయాయని అధికారులు తెలిపారు. దాదాపు 40 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదంలో 11 మంది చనిపోగా, 40 మందికిపైగా ప్రయాణీకులు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదముంది.
క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. పదుల సంఖ్యలో అంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.20కుపైగా అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దింపారు. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి గాయపడ్డవారిని ఆసుపత్రులకు తరలించేందుకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు.
రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ప్రమాదఘటన విజువల్స్ ఇప్పుడు మీడియాలో వైరల్ అయ్యాయి.