హర్యానా మాజీ సీఎం, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధినేత (INLD)చీఫ్ ఓం ప్రకాశ్ చౌతాలా తుదిశ్వాస విడిచారు. గురుగ్రావ్ లోని ఆయన నివాసంలో కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూసినట్లు ఐఎన్ఎల్‌డీ వర్గాలు తెలిపాయి. చౌతాలా వయసు 89 ఏళ్ళు . 1989 నుంచి 2005 వరకు హర్యానాకు ఐదుసార్లు సీఎంగా సేవలందించిన చౌతాలా, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు.
చౌతాలా జనవరి 1, 1935న సిర్సాలో జన్మించారు. చివరిసారిగా 2009లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఓం ప్రకాష్ చౌతాలా తండ్రి చౌదరి దేవి లాల్ దేశానికి 6వ ఉప ప్రధానిగా సేవలందించారు. రికార్డు స్థాయిలో హర్యానా ముఖ్యమంత్రిగా చౌతాలా పనిచేశారు.
రాజకీయ జీవితంలో పలు ఆటుపోట్లను ఓం ప్రకాష్ చౌతాలా ఎదుర్కొన్నారు. రిక్రూట్‌మెంట్ స్కామ్ లో జైలు జీవితాన్ని గడిపారు.