ఐసీసీ మహిళల టీ20-2028 ప్రపంచకప్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ-2025 నిర్వహణ లో గందరగోళానికి ఐసీసీ తెరదించింది. వచ్చే ఏడాది జరిగే ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించనున్నట్లు స్పష్ట చేసింది.
పాకిస్తాన్ తో పాటు, తటస్థ వేదికగా కూడా ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరుగుతుందని ఐసీసీ తెలిపింది. భారత్ తన మ్యాచ్‌లను తటస్థ వేదికలో ఆడనుంది. భారత్, పాక్ దేశాలు నిర్వహించే ఐసీసీ ఈవెంట్‌లలోని ఇరు దేశాల మ్యాచులన్నీ 2027 వరకు తటస్థ వేదికలలోనే జరుగుతాయి.
ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ -2025కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుంది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 కు భారత్ వేదికగా జరగనుంది. 2026లో జరిగే ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ను భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యం ఇస్తాయి. అప్పటి వరకు తటస్థ వేదికగానే పాక్, భారత్ మ్యాచ్ లు ఉంటాయి.
2028లో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను పీసీబీకి దక్కాయి. క్రికెట్ ఆస్ట్రేలియా 2029- 2031 మధ్యకాలంలో ఐసీసీ మహిళల ఈవెంట్‌లలో ఒకదానికి ఆతిథ్యం ఇవ్వనుంది.