పార్శిల్‌లో శవం బయటపడింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగు చూసింది.
ఉండి మండలం యండగండి గ్రామంలో సాగి తులసి అనే మహిళ ఇల్లు నిర్మించుకుంటోంది. ప్రభుత్వం ఉచితంగా భూమి ఇచ్చింది. ఇంటి నిర్మాణం కోసం తులసి క్షత్రియ సేవా సమితి సాయం కోరింది. వారు మొదటి విడతలో టైల్స్ పంపించారు. మరోసారి సాయం కోసం వారికి లేఖ రాయగా మరో పార్శిల్ పంపించారు. అందుల్ విద్యుత్ సామగ్రి ఉన్నట్లు భావించారు. విప్పి చూడగా అందులో శవం కనిపించింది. దీంతో తులసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పార్శిల్‌లోని శవాన్ని పరిశీలించారు. అందులో శవం పురుషుడిదిగా గుర్తించారు. అతని వయసు 45 సంవత్సరాలు ఉండ వచ్చని అంచనావేశారు. పార్శిల్ పెట్టెలో ఓ లేఖను గుర్తించారు. కోటి 30 లక్షలు పంపాలని లేదంటే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.