అమెరికా అధ్యక్షుడిగా త్వరలో పగ్గాలు చేపట్టబోతోన్న డొనాల్డ్ ట్రంప్ మెడకు మరో ఉచ్చు బిగుస్తోంది. శృంగార తారతో గతంలో ట్రంప్ ఏకాంతంగా గడిపాడని అతనిపై కేసు నమోదైంది. ఈ కేసును న్యూయార్క్ కోర్టు విచారిస్తోంది. తాజాగా ట్రంప్‌పై అభియోగాలు నిజమని 12 మంది జడ్జిల ధర్మాసనం నిర్ధారించింది. ట్రంప్‌పై నమోదైన అభియోగాలు కొట్టి వేసేందుకు కోర్టు నిరాకరించింది.
2016ఎన్నికల ముందు పోర్న్ స్టార్ స్టారీ డానియెల్స్ నోరు విప్పకుండా ఉండేందుకు లక్షా 20 వేల డాలర్లు చెల్లించినట్లు కోర్టు నిర్ధారించింది. ఈ డబ్బు పార్టీ ఫండ్ నుంచి చెల్లించేందుకు రికార్డులు తారుమారు చేసినట్లు గుర్తించారు. దీంతో ట్రంప్ ఈ కేసు నుంచి ఉపశమనం లభించే అవకాశం లేదు.
వ్యక్తిగత వ్యవహారంలో కాబోయే అధ్యక్షుడికి ఉపశమనం కల్పించలేమని కోర్టు వ్యాఖ్యానించింది.శృంగార తారతో ఏకాంతంగా గడపడంతోపాటు, ఆమెకు పార్టీ ఫండు నుంచి అక్రమంగా లక్షా 20 వేల డాలర్లు హష్‌మనీ చెల్లించినట్లు కోర్టు నిర్దారించింది. ఈ కేసులో డానియల్స్‌తో పాటు మరో 22 మంది సాక్షులను కూడా విచారించారు.
ఈ కేసులో తీర్పు వస్తే ముద్దాయిగా వైట్ హౌసులో ట్రంప్ అడుగుపెట్టబోతోన్న మొదటి అధ్యక్షుడిగా నిలవనున్నారు.