మహిళల క్రికెట్ అండర్ 19 ఆసియా కప్ టోర్నీలో భాగంగా పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 67 పరుగులు చేసింది. పాకిస్తాన్ విధించిన లక్ష్యాన్ని భారత మహిళల జట్టు కేవలం ఒక వికెట్ మాత్రమే నష్టపోయి 7.5 ఓవర్లలోనే 68 పరుగులు చేసి విజయం సాధించింది.
పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో కోమల్ ఖాన్ (24) టాప్ స్కోరర్. ఫాతిమా ఖాన్ (11) మినహా మిగతా వారు రెండెంకల స్కోర్ కూడా చేయలేకపోయారు.
భారత బౌలర్లలో సోమన్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా మిథిల, పరుణికా సిసోడియా, జోషిత తలా ఒక వికెట్ తీశారు.
లక్ష్య చేధనలో భారత్ ఒక వికెట్ ను కోల్పోయింది. ఓపెనర్ త్రిష, ఫాతిమా ఖాన్ వేసిన 0.2 బంతికి డకౌట్ కాగా సనికా చాల్కే క్రీజులోకి అడుగుపెట్టింది. కమిలిని, సనికా కలిసి 7.5 బంతుల్లో 68 పరుగులు చేసి భారత్ కు విజయం అందించారు.
ఈ టోర్నీలో పాకిస్తాన్, నేపాల్‌తో కలిసి భారత్ జట్టు గ్రూప్ ‘ఎ’ లో పోటీ పడుతోంది. బంగ్లాదేశ్, శ్రీలంక, మలేసియా గ్రూప్ ‘బి’లో ఉన్నాయి. గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సూపర్–4కు అర్హత సాధించనున్నాయి. అందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఈ నెల 22 ఫైనల్ లో తలపడనున్నాయి.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు