రాష్ట్రంలో నేడు ఈరోజు అక్కడక్కడా వానలు పడే అవకాశముంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ తమిళనాడు – శ్రీలంక తీరాలను తాకే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం , దక్షిణ కోస్తా, రాయలసీమ వాతావరణం ప్రభావం చూపనుంది.
నెల్లూరు, తిరుపతి జిల్లాల పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.డిసెంబర్ 15 వరకు రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. అల్పపీడనం నేపథ్యంలో నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.