అండర్ 19 ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు తుది లీగ్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా మ్యాచ్ గెలిచి, సెమీఫైనల్స్‌కు చేరుకుంది.
ఇవాళ భారత్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య షార్జాలో ఆఖరి లీగ్ మ్యాచ్ జరిగింది. మొదట యుఎఇ జట్టు బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు 44ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయింది. యుఎఇ జట్టులో ఏ ఒక్కరూ అర్ధశతకం సాధించలేకపోయారు. భారత బౌలర్లలో యుధాజిత్ 3, చేతన్ శర్మ 2, హార్దిక్ రాజ్ 2, కార్తికేయ 1, ఆయుష్ మాత్రే 1 వికెట్లు పడగొట్టారు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 16.1 ఓవర్లలోనే 143 పరుగులు చేసి, లక్ష్యాన్ని ఛేదించింది. ఆయుష్ మాత్రే 51బంతుల్లో 67 పరుగులు, వైభవ్ సూర్యవంశీ 46 బాల్స్‌లో 76 రన్స్ చేసారు. దాంతో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా, పది వికెట్ల ఆధిక్యంతో భారత జట్టు యుఎఇపై విజయం సాధించింది. ఆయుష్ మాత్రే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
సెమీఫైనల్స్‌లో భారత జట్టు శ్రీలంకను ఎదుర్కొంటుంది. ఆ మ్యాచ్ డిసెంబర్ 6న జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 10న దుబాయ్‌లో జరుగుతుంది.