దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఉదయాన్నే ఓ కుటుంబంలోని ముగ్గురిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఢిల్లీలోని నెబ్‌సరాయి ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ఢిల్లీలోని నెబ్‌సరాయి ప్రాంతంలో ఆర్మీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న రాజేష్ కుటుంబం నివశిస్తోంది. ఇవాళ రాజేష్ వివాహ వార్షికోత్సవం జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. రాజేష్ కుమారుడు వివాహ వార్షికోత్సవ ఏర్పాట్లలో బిజీగా ఉన్నాడు. ఉదయాన్నే అతను బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగులు రాజేష్ కుటుంబాన్ని బలితీసుకున్నారు.
దుండగుల దాడిలో దంపతులు రాజేష్, కోమల్, కుమార్తె కవిత అక్కడికక్కడే చనిపోయారు.బయటకు వెళ్లి వచ్చిన రాజేష్ కుమారుడు ఇంట్లో జరిగిన దారుణం చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమారుడి ఫిర్యాదుతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ సేకరించి పోలీసులు విచారణ చేపట్టారు.